తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

విశ్వం న్యూస్/ హైదరాబాద్/అక్టోబర్ 17 : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ముగింపు వేడుకలు సద్దుల బతుకమ్మ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు మహిళల ఆటపాటలతో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయని పేర్కొన్నారు.

‘మల్లారావమ్మా బతుకమ్మా.. మా బతుకులు బాగు చేయవమ్మా’ అంటూ బతుకమ్మకు వీడ్కోలు పలుకుతూ తెలంగాణ ఆడబిడ్డలు ఘనంగా ఈ సాంస్కృతిక వేడుకలను ముగిస్తారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో, రాష్ట్ర ప్రగతిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని కేసీఆర్ గుర్తుచేశారు. మహిళల కృషి, త్యాగాలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిందని తెలిపారు.

ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం కలగకుండా చూడటం, వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే బతుకమ్మ పండుగ స్ఫూర్తిని కొనసాగించినవారమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆడబిడ్డల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *