వేల కోట్ల భూముల దందా: శ్రవణ్ ఆరోపణలు

హైదరాబాద్: శంషాబాద్ పెద్దషాపూర్‌లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే భారీ భూకుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ Sravan Dasoju తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి T. Harish Rao ఆధారాలతో లేవనెత్తిన ప్రశ్నలకు రెవెన్యూ మంత్రి Ponguleti Srinivasa Reddy సమాధానం చెప్పలేక దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు.
హైకోర్టు ఆదేశాలు, ‘భూభారతి’ చట్టాన్ని పక్కన పెట్టి తహసీల్దార్ మ్యూటేషన్ ఆర్డర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించిన శ్రవణ్, ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ పాత్ర కూడా అనుమానాస్పదమని అన్నారు. ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చేందుకు కలెక్టర్‌ను “కవచకుండలం”లా ఉపయోగిస్తోందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి Revanth Reddy పాలన ప్రజాపాలన కాదని, “సర్కస్ కంపెనీ”లా మారిందని ఎద్దేవా చేశారు. పరిపాలన అంటే పబ్లిసిటీ కాదని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలే అసలు గవర్నెన్స్ అని పేర్కొన్నారు.
అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత బక్కాని నరసింహుల వ్యాఖ్యలను ఖండిస్తూ, N. Chandrababu Naidu తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.