మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన సర్పంచ్ల ఫోరం నాయకులు
గ్రామపంచాయతీల అభివృద్ధికి సహకరించాలి
ములుగు, జనవరి 3 (విశ్వం న్యూస్) : గ్రామపంచాయతీలో భవన నిర్మాణాలకు సైడ్ డ్రైనేజీలకు అధిక నిధులు కేటాయించాలని గోవిందరావుపేట మండలం సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోరిక గోవింద నాయక్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అంతరం పలు డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని దయాకర్ రావు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు భూక్య మోహన్ సర్పంచులు స్వాతి వాగ నాయక్ రాకేష్ మౌనిక వినోద్ తదితరులు పాల్గొనడం జరిగింది.
