జపాన్ లో నర్సింగ్ సిబ్బందిగా పని చేయుటకు ఆసక్తి, అర్హత గలవారు పేర్లు నమోదు చేసుకోవాలి

జిల్లా ఉపాధి కల్పన అధికారి వై. తిరుపతి రావు
పెద్దపల్లి,, జనవరి 3 (విశ్వం న్యూస్) : జపాన్ లో నర్సింగ్ సిబ్బంది గా పని చేయడానికి ఆసక్తి, అర్హత గల వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి వై. తిరుపతి రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4న వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాల క్యాంపస్ లో గల గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించు స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాలి. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా శిక్షణతో పాటు నియామకం కొరకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 4న వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాల క్యాంపస్ లో గల గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22 నుండి 35 సంవత్సరాల వయసు గల బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, జి.ఎన్.ఎం. డిప్లమా హోల్డర్లు ఈ నెల 4న ఉదయం 10 గంటలకు వరంగల్ లో నిర్వహించు స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. ఎంపిక చేయబడిన అభ్యర్థులకు జపనీస్ భాష పై రెసిడెన్షియల్ శిక్షణ జపాన్ లో పనిచేయడానికి అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలు అందించబడతాయని విజయవంతమైన అభ్యర్థులు నెలకు రూ.1.20 ను డి 1.50 లక్షలు సంపాదించవచ్చు అని తెలిపారు.
ఇతర వివరాలు కొరకు టామ్ కామ్ హెచ్ ఆర్ మేనేజర్ సెల్ నెంబర్ 9100798204 / 9908830438 నందు సంప్రదించాలని, మరిన్ని వివరాల కోసం www.tomcom.telangana.gov.in సందర్శించాలని వై తిరుపతి రావు ఆ ప్రకటనలో తెలిపారు.