గ్రామ అభివృద్ధిపై ఎమ్మెల్యేతో సమావేశం

గ్రామ అభివృద్ధిపై ఎమ్మెల్యేతో సమావేశం

రేణికుంట సర్పంచ్ బోయిని కొంరయ్య
తిమ్మాపూర్, జనవరి 20 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో శుక్రవారం గ్రామ అభివృద్ధి పనులు, నిధుల కేటా యింపు, అభివృద్ధి పనుల పురోగతి పై రాష్ట్ర సంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూరు నియో జకవర్గం ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్, గ్రామ సర్పంచ్, సర్పంచ్ ల సంఘo జిల్లా అధ్యక్షులు బోయి ని కొంరయ్యతో ప్రత్యేక సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.రసమయి సర్పంచ్ బోయిన కొమురయ్య ఇంటికి స్వయంగా వెళ్లి, గ్రామ అభివృద్ధికి తాను కేటాయించిన నిధులతో ఎలాంటి పనులు పూర్తి అయినవి, వాటి వివరాలు తెలుసు కొని, గ్రామ అభివృద్ధిలో భాగంగా ఏమైనా నిధులు అవసరం ఉంటే తనకు తెలియజేయాలని సూచిం చారు. అనంతరo గ్రామంలో పార్టీ బలోపేతం గురిం చి చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని కొమరయ్య రేణికుoట గ్రామంలోని ఒడ్డెర, వీరముష్టి కులస్థుల సంఘ భవనాల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరినారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డా. రసమయి ఒడ్డెర, వీరముష్టి కులస్థుల సంఘ భవనాల నిర్మాణం కొరకు నిధులు తప్పకుండ మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *