బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

కండువాలు కప్పి ఆహ్వానించిన డా.రసమయి బాలకిషన్
తిమ్మాపూర్, జనవరి 20 (విశ్వం న్యూస్) : రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ సమక్షంలో శుక్రవారం మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామంలోని యువజన సంఘాలకు చెందిన సుమారు 200 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీ గులాబీ గూటికి చేరగా, కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

సీఎం కేసిఆర్ పాలనతో పాటు మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపడు తున్న అభివృద్దికి ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని, రానున్న ఎన్నికల్లో రసమయి బాల కిషన్ గెలుపు కోసం కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. అనంతరం గ్రామపంచాయితి కార్యాలయం లో లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మెన్ జీ.వి. రామకృష్ణారావు, మానకొండూరు జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్ తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పం చులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
