ఫిబ్రవరి 11న సరూర్ నగర్ స్టేడియంలో మెగా జాబ్ మేళా

బోడుప్పల్, ఫిబ్రవరి 3 (విశ్వం న్యూస్) : ఫిబ్రవరి 11న సరూర్ నగర్ స్టేడియం నందు జరిగే అతి పెద్ద మెగా జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలొనే ఇది అతిపెద్డ జాబ్ మేళా అని వారు తెలిపారు. దాదాపు 120 కంపెనీలు (టెక్నికల్,నాన్ టెక్నికల్, ఐ.టీ మరియు నాన్ ఐ.టీ) కంపెనీలు పాల్గొంటాయు అని తెలిపారు.దాదాపు 10,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగం లేదని బెంగ అవసరం లేదని అన్నారు. ఏడవ తరగతి నుండి పి.జీ.వరకు పాస్ అయిన వారి అందరు ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. వికలాంగులు, మూగ, చెవిటి,అంధులకు, బదిరులుకు కూడా తమ పేరు నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు.ఇట్టి జాబ్ మేళా నందు ఉద్యోగం వచ్చినవారికి అదే రోజు సాయంత్రం అప్పాయింట్ మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ప్రతి ఒక్క నిరుద్యోగి ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకు ఇట్టి ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఉద్యోగం లేదని చింత విడిచిపెట్టండి. ఉద్యోగాన్ని బట్టి దాదాపు 15000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు జీతం లభిస్తుంది అని తెలిపారు. నిరుద్యోగులు అందరూ కూడా ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే దరఖాస్తు ఎక్కడ తీసుకుంటామో తదితర విషయాలు మరోసారి పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది అని తెలిపారు.
సందేహాలు ఉంటే
📞7286008234
📞9505437112
📞8247768371 నంబర్ల యందు సంప్రదింపులు చేయవచ్చు అని తెలిపారు.