మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన కరీంనగర్ గౌడ సంఘం నాయకులు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన
కరీంనగర్ గౌడ సంఘం నాయకులు

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 17 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల జాతర ఉత్సవ సందర్భంగా మన గౌడ కుల పెద్దలు మాజీ శాసనసభ్యులు కోడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ల అధ్వర్యంలో కరీంనగర్ గౌడ సంఘం నాయకులతో కలిసి మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ ను, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ను, గౌడ సంఘం హాస్టల్స్ డైరెక్టర్ లను ఈ నెల 25 న మంగళవారం రోజున జరిగే బోనాల జాతరకు ఆహ్వానిస్తూ వారి ఇండ్లలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల పండుగ జోగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ కమిటీ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిసిన కరీంనగర్ గౌడ సంఘం నాయకులు

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, బోనాల రాజేశం గౌడ్, కార్పొరేటర్లు మాధవి కృష్ణ గౌడ్, గుగ్గిల్ల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్, కలర్ సత్యనారాయణ గౌడ్, గొడిషల రమేష్ గౌడ్, నాగుల కిరణ్ గౌడ్, హరి కుమార్ గౌడ్,ఆరే రావిగౌడ్, ఆలయ పూజారులు, గౌడ నాయకులు, గౌడ కులస్తులు, తదితరులు పాల్గొన్నారని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ కమిటీ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ను కలిసిన కరీంనగర్ గౌడ సంఘం నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *