
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విశ్వం న్యూస్) : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత గాయపడ్డారు. ‘కాలు ఫ్రాక్చర్ కావడంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యుల సూచన. ఎలాంటి సహాయమైనా లేదా సమాచారం కోసం నా ఆఫీసు అందుబాటులో ఉంటుంది’ అంటూ కవిత ట్వీట్ చేశారు.
గాయం కారణంగా కవిత కొన్నిరోజుల పాటు రాజకీయ సమావేశాలు, సభలకు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తుంది.