Today TrendingVishwam Newsరంగారెడ్డిహైదరాబాద్

అక్రమ కట్టడాలు.. నేతల అండతోనే…

  • జోరుగా బోడుప్పల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టుపక్కల అక్రమ కట్టడాలు
  • చూసి చూడనట్టు పోతున్న అధికారులు, పాలకవర్గాలు ఎందుకు..?
  • పాత కమిషనర్ ఆధ్వర్యంలో 356 అక్రమ కట్టడాలు గుర్తించారు
  • కేవలం 16 అక్రమ కట్టడాలు కూల్చారు.. మిగతా వాటి మీద చర్యలెప్పుడో..?
  • డివిజన్లలో కార్పొరేటర్లదే హావా కొనసాగితే అధికారులు ఎందుకు..?

బోడుప్పల్, ఏప్రిల్ 11 (విశ్వం న్యూస్) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానిక ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. పాత కమిషనర్ ఆధ్వర్యంలో సుమారుగా 356 అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించి, ఒక లిస్టు ప్రిపేర్ చేసి జిల్లా కలెక్టర్, హెచ్ఎండిఏ అధికారుల ఆధ్వర్యంలో 16 కట్టడాలను మాత్రమే కూల్చారు. మిగతా కట్టడాలపై ఎప్పుడు చర్యలు ఉంటాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కార్పొరేషన్ లో పాలకవర్గాలు డివిజన్లలో కార్పొరేటర్లదే హవా కొనసాగితే మరి కమిషనర్, అధికారులు, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కమిషనర్ అధికారులకు కోట్ల రూపాయల జీతాలు ఎందుకని మొరపెట్టుకుంటున్నారు. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సరస్వతి నగర్, పెంట రెడ్డి కాలనీ, మరుతి నగర్, రామ్ రెడ్డి నగర్, తదితర కాలనీలలో అదేవిధంగా గవర్నమెంట్ హై స్కూల్ చుట్టుపక్కల భవాని నగర్, రెడ్డిస్ కాలనీ తదితర కాలనీలలో వేలాదిగా పుట్టుకొస్తున్న అక్రమ కట్టడాలపై నూతన కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, మేయర్ ప్రత్యేక చొరవ తీసుకొని పై అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకుంటారని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

లేనిపక్షంలో జిల్లా మంత్రి, కలెక్టర్, సిడిఎంఏ, ఆర్డిఓ తదితర అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకడబమని ఆయా కాలనీలో ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *