రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ స్పెషల్ కో-ఆర్డినేటర్ గా సజ్జు నియామకం

రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్
స్పెషల్ కో-ఆర్డినేటర్ గా
సజ్జాద్ మొహమ్మద్ నియామకం

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి
జమ్మికుంట, మే 28 (విశ్వం న్యూస్) : ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్స్ఫూ ర్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ కు హుజురాబాద్ నియోజకవర్గానికి క్విజ్ కాంపిటీషన్ స్పెషల్ కో-ఆర్డినేటర్ గా సజ్జాద్ మొహమ్మద్ ను నియమించిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి.

7661 899 899 అనే నంబర్ కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా లింక్ వస్తుంది, ఈ లింకులో రిజిస్ట్రేషన్ చేసుకొనే చివరి తేదీ జూన్ 17 సాయంత్రం ఐదు గంటల వరకు, జూన్ 18వ తేదీ ఆన్లైన్లో ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్క యువతి, యువకులంతా కూడా ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజీవ్ గాంధి క్విజ్ కాంపిటీషన్ స్పెషల్ కో-ఆర్డినేటర్ మరియు యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ ఉపాధ్యక్షుడు సజ్జు తెలిపారు.

ఈ సందర్భంగా సజ్జు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 44 బహుమతులను గెలుపొందిన వారికి ఇవ్వడం జరుగుతుంది. మొదటి బహుమతి లాప్టాప్, రెండవ బహుమతి స్మార్ట్ ఫోన్ , మూడో బహుమతి ట్యాబ్. ప్రతి నియోజకవర్గానికి ఒక మహిళా టాపర్ కు స్పెషల్ గిఫ్ట్ గా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, పది స్మార్ట్ వాచ్లు, 10 ఇయర్ బర్డ్స్, పది హార్డ్ డ్రైవ్, 10 పవర్ బ్యాంకులను బహుకరించబడును అని ఒక ప్రకటనలో తెలిపారు. సజ్జు నియామకం పట్ల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్నా యకులు , విద్యార్థి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *