కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలి

కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలి

రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి హరీష్ రావు

పెద్దపల్లి, జనవరి 12 (విశ్వం న్యూస్) : జిల్లాలో కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం మంత్రి తన్నీరు హరీష్ రావు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేత లతో కలిసి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశం హాలు నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఈ సమీక్ష లో పాల్గోన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇది చాలా సున్నితమైన కార్యక్రమం, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న పొరపాటు జరగకుండా, అధికారులు అప్రమత్తంగా ఉంటూ కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని మంత్రి కోరారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో 34 బృందాల ద్వారా కంటి వెలుగు నిర్వహిస్తున్నామని, అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉందని, జిల్లాకు ఇప్పటి వరకు 29 వేల 255 రీడింగ్ గ్లాసెస్ చేరాయని, మరో 4 వేలు +1.5 రీడింగ్ గ్లాసెస్ రావాల్సి ఉందని, 68 ట్యాబులను సాఫ్ట్ వేర్ తో సిద్దం చేసామని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా పంచాయతి అధికారి చంద్రమౌళి, సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *