యువత మంచి ఆదర్శాలను అలవర్చుకోవాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి, జనవరి 12 (విశ్వం న్యూస్) : యువత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మంచి ఆదర్శాలను, అలవాట్లను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గురువారం జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా జిల్లా యువజన, క్రీడా శాఖ అధ్వర్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన యువజన వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద చిత్ర పటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యువత స్వామి వివేకానంద ఆదర్శాలను స్వీకరించి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు. స్వామి వివేకానంద భారతీయతకు చిహ్నం అని, పార్లమెంట్ ఆఫ్ రీలిజియస్ కాన్పరెన్స్ లొ ఒక్క మాటతో దేశ ఔనత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటారని , అంతటి మహానుభావుడు స్వామి వివేకానంద అని, ఆ కారణంగా ఆయన జన్మదినం సందర్బంగా దేశవ్యాప్తంగా యువజన దినోత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. ఆయన జీవితంలో అనేక కష్టాలు అనుభవించి ఉన్నత స్థాయికి ఎదిగారని, ప్రస్తుతం విద్యార్థులు వివేకానందుడి ఆదర్శాలను తీసుకొని జివితంలో ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ భాడిస్) కుమార్ దీపక్,జిల్లా యువజన క్రీడా శాఖాథికారి తిరుపతి రావు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది,యువజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.