శ్రీ శక్తి ఇండస్ట్రీస్ దొంగ
దందా కనబడుటలేదా

- కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి
జమ్మికుంట, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : సోమవారం వెలుగులోకి వచ్చిన శ్రీ శక్తి ఇండస్ట్రీస్ సి.ఎం.అర్ దొంగ దందా విషయం నేపథ్యంలో స్పందించిన కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సామాన్య పేద ప్రజల రేషన్ బియ్యాన్ని కొందరు దళారులు మిల్లులలో రీసైక్లింగ్ చేసి మళ్లీ గోదాములకు పంపించిన బియ్యాన్ని అధికారులు లారీలను ఏడు రోజులుగా జమ్మికుంట పత్తి మార్కెట్లో నిలుపుదల చేయగా, ఇప్పటికీ ఐనా అధికారులు స్పందించి లారీలు సీజ్ చేయాలని మరియు రైస్ మిల్లులో బియ్యం రిసైక్లింగ్ చేయడంపై కరీంనగర్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జమ్మికుంట పట్టణంలోని శ్రీశక్తి ఇండస్ట్రీస్ వడ్లను అమ్ముకోవడం రేషన్ బియ్యం కొనుగోలు వాటిని రిసైక్లింగ్ జరిపి మిల్లులో నిల్వ ఉంచి ప్రభుత్వాన్ని మోసగిస్తున్నందున ఈ మిల్లులో జరిగే అక్రమాలపై విచారణ జరిపి మిల్లులను సీజ్ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.