ప్రిన్సిపాల్ దాష్టీకం
టెన్త్ విద్యార్ధినులను చితకబాదిన ప్రిన్సిపల్
విద్యార్థినుల శరీరంపై కమిలిన గాయాలు
కారణం లేకుండా కొట్టారంటూ విద్యార్థినిలు ఆవేదన
భోజనం సరిగా పెట్టటం లేదంటూ ఆరోపణ
మధిర, పిబ్రవరి 19 (విశ్వం న్యూస్) : మధిరలోని మహాత్మ జ్యోతిబాపులే బీసీ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి చదువుతున్న బాలికల్ని ప్రిన్సిపల్ విచక్షారహితంగా కొట్టడంతో అమ్మాయిల శరీరాలు కమిలిపోయాయి. స్టూడెంట్స్‌ను ప్రిన్సిపల్ అకారణంగా కొట్టడంతో విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో భోజనం కూడా సరిగాపెట్టడం లేదని ఆరోపిస్తున్నారు.