బంగారు మైసమ్మ ఆలయ పునర్నిర్మాణం

బంగారు మైసమ్మ ఆలయ పునర్నిర్మాణం

  • శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు ఆలయ పైకప్పు (స్లాబ్)ను స్థానిక కార్పొరేటర్ శ్రీ తలారి చంద్రశేఖర్ సొంత నిధులతో వేయించారు.

బండ్లగూడ జాగిర్, మార్చి 19 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ ఒకటో వార్డు లోని బృందావనం కాలనీలో శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు ఆలయ పైకప్పు (స్లాబ్)ను స్థానిక కార్పొరేటర్ శ్రీ తలారి చంద్రశేఖర్ సొంత నిధులతో వేయించారు. అతి త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని చుట్టుపక్కల భక్తుల అందరికి అమ్మవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తామని కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. స్లాబ్ కు సంభందించిన ఎలక్ట్రిక్ పైపులను జంగయ్య సమకూర్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తలారి ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొరివి గణేష్, నేత సురేష్, గోపాల్, రమేష్, శ్రీనివాస్, ప్రభాకర్, శ్రీకాంత్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *