రూ.10, రూ.500 నోట్లు
విడుదలకు సిద్ధం

హైదరాబాద్, ఎప్రిల్ 5 (విశ్వం న్యూస్): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే, మహాత్మా గాంధీ సిరీస్‌లో భాగంగా కొత్త రూ.10 మరియు రూ.500 నోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ కొత్త నోట్లు కొత్త ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ఉండనున్నాయి. ఈ మేరకు ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త నోట్లతో పాటు, ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత నోట్లన్నీ చట్టబద్ధంగానే చలామణిలో కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ తెలిపింది.
2024 డిసెంబరులో శక్తికాంత దాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత, కొత్త సంతకాలతో కూడిన రూ.100, రూ.200 నోట్లను విడుదల చేస్తున్నట్లు గత నెలలోనే ప్రకటించింది. ఇకపోతే, కొత్త రూ.500 నోట్ల పరిమాణాన్ని 66mm x 150mmగా నిర్ణయించినట్లు సమాచారం. అలాగే రంగు, డిజైన్, పరిమాణంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నోట్ల బూడిద స్టోన్ గ్రే రంగులో ఉన్నాయి.