రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ రాష్ట్ర భారీ బడ్జెట్‌

రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ రాష్ట్ర భారీ బడ్జెట్‌

అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్‌: హరీష్ రావు!
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విశ్వం న్యూస్) : రూ.2,90,396 కోట్ల మొత్తంతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసనసభలో హరీశ్ రావు, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి 15, 033 కోట్లు కోత పెట్టింది- హరీష్ రావు

  • కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
  • విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం, కేంద్రం నిధులు కేటాయించాలి.
  • ప్రతిఏటా 450 కోట్ల చొప్పున 1350 కోట్లు ఇవ్వలేదు.
  • మిషన్ భగీరథ పథకానికి 19, 205 కోట్లు…
  • 30 రోజుల్లోగా ఏపీ జెన్కో కు 6756 కోట్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
  • ఆయిల్ ఫామ్ సాగుకు 1వెయ్యి కోట్లు ప్రతిపాదన.
  • వ్యవసాయ రంగానికి 26, 831 కోట్లు ప్రతిపాదన.
  • నీటిపారుదల రంగానికి 26, 885 కోట్లు ప్రతిపాదన.

విద్యుత్ శాఖ కోసం 12, 727 కోట్లు కేటాయింపు

  • ప్రజాపంపిణీ వ్యవస్థకు 3,117 కోట్లు కేటాయింపు.
  • ఆసరా పింఛన్ల కోసం 12000 కోట్లు.
  • దళితబంధు కోసం 17, 700 కోట్లు.
  • షెడ్యూల్ కులాల ప్రత్యేక నిధి 36, 750 కోట్లు.
  • షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి 15, 233 కోట్లు.
  • బిసి సంక్షేమం కోసం వార్షిక బడ్జెట్ 6,229 కోట్లు.
  • కల్యాణ లక్ష్మీ, షాధి ముబారక్ కోసం 3210 కోట్లు.
  • మహిళా శిశు సంక్షేమం కోసం 2131 కోట్లు.
  • మైనార్టీ సంక్షేమం కోసం 2200 కోట్లు.
  • అటవీశాఖ, హరితహారం కోసం 1471 కోట్లు.

విద్యాశాఖకు ఈ బడ్జెట్ లో 19, 093 కోట్ల ప్రతిపాదన

  • కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కు 200కోట్ల ప్రతిపాదన.
  • వైద్య, ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్ లో 12, 161 కోట్లు.
  • పంచాయితీ శాఖకు 31, 426 కోట్లు కేటాయింపు.
  • పురపాలక శాఖకు 11, 372 కోట్ల ప్రతిపాదన.
  • ఈ ఏడాది ఆర్ అండ్ బి శాఖకు రోడ్ల మరమ్మత్తు కోసం 2500 కోట్లు.
  • పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్ లో 4037 కోట్లు.
  • ఈ సంవత్సరం బడ్జెట్లో హోమ్ శాఖకు 9, 599 కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *