శర్వానంద్, రక్షితల నిశ్చితార్ధం

అతిథులుగా రాంచరణ్, ఉపాసన దంపతులు
హైదరాబాద్, జనవరి 26 (విశ్వం న్యూస్) : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగులు వేయనున్నారు. గురువారం ఆయన నిశ్చితార్థం జరిగింది. ఇరువైపు కుటుంబాల సమక్షంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్ రామ్‌చరణ్, ఆయన సతీమణి, ఉపాసన తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.


