రాష్ట్ర ఎస్.జి.టి ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

రాష్ట్ర ఎస్.జి.టి ఫోరం
నూతన కార్యవర్గం ఎన్నిక

  • రాష్ట్ర అధ్యక్షులుగా
    అలుమల్ల అనిల్ కుమార్ రెడ్డి

తిమ్మాపూర్, జూలై 30 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం యాదాద్రిలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో (2023-2025) రెండు సంవత్సరాలకాల వ్యవధికి గాను రాష్ట ఎస్.జి.టి ఫోరం నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

అనిల్ కుమార్ రెడ్డి – శిరందాసు రామదాసు

ఈ నూతన కార్యవర్గంలో ఎస్.జి.టి ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా అలుమల్ల అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శిరందాసు రామదాసు, కోశాధికారి పానుగంటి నర్సింహ్మాచారి, అదనపు ప్రధాన కార్యదర్శులుగా ఎండి జమాల్, జాలిగామ వెంకటయ్య, మహిళా ఉపాధ్యక్షురాలు ఎం. అరుణ, అసోసియేట్ అధ్య క్షులు ఎస్. ప్రవీణ్ కుమార్, ఎండి ఇర్పానుద్దీన్, కె. ప్రభాకర చారీ, అజ్మీరా విఠల్, రాష్ట్ర ఉపాధ్య క్షులు గా కొండపాక వేణుగోపాల్, జె.రవికిరణ్, ఏ.ధన్ సింగ్, రాష్ట్ర కార్యదర్శులుగా బి.శ్రీనివాస్, సకినాల మమత, జి.అజయ్ కుమార్, కె.రాంమో హన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం నూతన కార్యవర్గo ఆధ్వర్యంలో ఎస్జీటీ ఫోరం సభ్యు లకు ప్రయోజనం చేకూర్చే విధంగా పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ రెడ్డి, పానుగంటి నర్సింహ్మాచారి, శిరందాసు రామదాసు, వెంకటయ్య, వేణుగోపాల్, శ్రీనీవాస్, రవూఫ్, రవికుమార్, శరత్ బాబు, వెంకన్న, శామ్ కుమార్, రాష్ట్ర బాధ్యులు, వివిధ జిల్లాల బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *