మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతం

- సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్
తిమ్మాపూర్, జనవరి 2 (విశ్వం న్యూస్): మహారాష్ట్ర నాందేడ్ లో సోమవారం గురుద్వారా లో పూజల అనంతరం స్థానిక నాందేడ్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దఎత్తున విచ్చేసి రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారికి సన్మానం చేయడం జరిగింది త్వరలో మహారాష్ట్ర లో బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం తీసుకోవల్సిన కార్యక్రమాలను వారితో చర్చిలు చేసి బిఆర్ఎస్ పార్టీ ద్వారానే దేశంలో సమూలమైన మార్పులు వస్తాయని రైతుల ప్రభుత్వం కేవలం కేసీఆర్ గారి తోనే సాద్యం అని వారు అన్నారు అదేవిధంగా మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు అందరితో కలిసి గురుద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారికి, రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ నాయకులకు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, కొత్తకొండ శ్రావణ్, మహారాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ నాయకులు మానిక్ రావు కదమ్, బాబురావు పాటిల్, రాజు పాటిల్, మహమ్మద్ అజారుద్దిన్, తదితరులు ఉన్నారు