విద్యార్థులు యువకులు మతోన్మాదానికి
వ్యతిరేకంగా ఉద్యమించాలి
వ్య. క .సా ,జాతీయ నాయకులు వెంకట్రాజం
గోవిందరావుపేట, ఏప్రిల్ 28 (విశ్వం న్యూస్) : విద్యార్థులు యువకులు మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు ఎద్దునూరి వెంకటరాజం పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ములుగు జిల్లా విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు పసర గ్రామములో ప్రారంభించారు ఈ శిక్షణ తరగతులకు మొదటి రోజు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు ఎద్దునురి వెంకట్రాజ్యం హాజరై మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం రెండో సారి అధికారం లోకి వచ్చి రాగానే మతాల మధ్య ఘర్షణ పెడుతూ ప్రజలను విభజిస్తు పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు.
మతం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలని తుంగలో తొక్కారని ఆరోపించారు. విద్యార్థులు యువకులు ఇలాంటి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా యువతీ యువకులను ఐక్యం చేసి దేశ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని యువతలో దేశభక్తి భావాలను పెంపొందించాలని ప్రజలు మరో స్వతంత్ర పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర సహాయ కార్యదర్శి దమెర కిరణ్ DYFI జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ SFI జిల్లా కార్యదర్శి తోకల రవి DYFI జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు సంజీవ తదితర్లు పాల్గొన్నారు.
