
- తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగకముందే అన్ని వర్గాల ప్రజల కొరకు ఎన్నో నూతన సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, అలాగే మా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి
- మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం
హైదరాబాద్ (విశ్వం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కారం కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానాన్ని సాధించటంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఎవరు ఊహించని విధముగా ఈ ఒక్క రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలుపరిచిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.
పత్రిక విలేకరులు అడిగిన ప్రశ్నలకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి పర్యటన చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకొని ఆ యొక్క రాష్ట్రాలలో వేరే పేర్లతో అమలుపస్తున్నారు. అలాంటి గుర్తింపు పొందిన మన తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలకు కావలసిన వారు అడగకముందే సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ మొత్తం భారతదేశ దృష్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై వచ్చినట్లు చేసిన ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పేరు గుర్తింపు రావడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం.
అలాంటి మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించడానికి ముందు అడుగు వేస్తారని ఆయన మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారని, ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో రెండవ పిఆర్సి కమిషన్ను వెంటనే నియమించి అప్పటికే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ 30% ఇవ్వాలని అలాగే పెండింగ్లో ఉన్న నాలుగు ఇంక్రిమెంట్లను వెంటనే మంజూరి చేయాలని ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే మంజూరు చేసి ప్రభుత్వ ఉద్యోగుల హృదయాలలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నిలిచిపోవాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులు శాసనసభ మున్సిపల్ గ్రామపంచాయతీ ఎన్నికలు ఒకటేసారి జరిపించాలని ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఇక్కడ కూడా అలాంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో రావచ్చు కనుక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలను పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పి ఆర్ సి రెండవ కమిషన్ కమిటీని వెంటనే నియమించి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో నెలల నుండి ఎదురుచూస్తున్న పిఆర్సి కమిషన్ వెంటనే ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల ఐ ఆర్ 30% వెంటనే ప్రకటించాలని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తో పాటు క్యాబినెట్ మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతా కుమారి ఐఏఎస్ కు తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
మన తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు ప్రాణాలను కూడా ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డ మన ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించడానికి ముందు వస్తారని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా విలేకరులకు ఇలా తెలియజేశారు.