తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు

  • తెలంగాణ కోసం అందరు కోట్లాడారు..
  • అమరుల ఆకాంక్ష నెరవేరకపోవడం బాధాకరం…
  • బలిదానాల బాధేంటో మా కుటుంబానికి బాగా తెలుసు… కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ
  • నిరుద్యోగులకు రూ.4 వేల భృతి
  • యువతకు రూ.10 లక్షల
    వడ్డీ లేని రుణం
  • యువ సంఘర్షణ సభలో
    డిక్లరేషన్ విడుదల

హైదరాబాద్, మే 8 (విశ్వం న్యూస్) : తెలంగాణను సీఎం కేసీఆర్ తన జాగీరు అనుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే అందరూ మంచి జరుగుతుందని అనుకున్నారని.. కానీ కేసీఆర్ నియంత పాలనతో ఆగం చేస్తున్నారని విమర్శించారు. సరూర్ నగర్ లో సోమవారం కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. జైబోలో తెలంగాణ అంటు ప్రసంగం ప్రారంభించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఎవరికైనా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి.. ఆ ఊసే ఎత్తడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే పరిమితం అయ్యాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డెవలప్ మెంట్ లేదు.. వివిధ వర్ణాల ప్రజలకు సాయం లేదు. ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వారంతా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటిందని, తెలంగాణ కోసం ఎందరో ఆత్మ బలిదానాలు చేశారు. మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసన్నారు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదని, తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చార న్నారు. ఆత్మబలిదానాలు వృధా కావద్దని సోనియా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ కోసం అన్ని వర్ణాలవారు పోరాదారన్నారు.

సోనియమ్మ బిడ్డగా హామీ ఇస్తున్న…
తెలంగాణను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని… ఆ చైతన్యం తోనే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. తనను ఇందిరమ్మ అంటే బాధ్యత ఇంకా పెరుగుతుంద న్నారు. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేని న్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని… పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని. అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక హామీలు నెరవేర్చలేకపోతే అధికారం వెనక్కు తీసుకోండని చెప్పారు.

నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి
తెలంగాణ ఏర్పడ్డాక 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రియాంక తెలిపారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నిం చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యో గులకు రూ. 4 వేలు భృతి ఇస్తామని ప్రకటించారు. యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామ ని తెలిపారు. ఉద్యోగాలు లేక లక్షలాది మంది నిరుద్యో గులు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని, పేపర్ లీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 9 ఏళ్లలో ప్రభుత్వం ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని, ప్రైవేట్ యూనివర్సిటీలకు మాత్రం అనుమతులు ఇస్తున్నా రని దుయ్యబట్టారు. బడ్జెట్లో విద్యకు కేటాయింపులు తగ్గిం చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అబద్ధపు వాగ్దానాలు చేయను.. ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తామని ప్రియాం కగాంధీ ప్రకటించారు.

యువతకు అన్యాయం: రేవంత్ రెడ్డి
తెలంగాణ సాధన ఆకాంక్షలు నెరవేరక నిరుద్యోగులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మనకు అండగా ఉండాలనే ప్రియాంక గాంధీ వచ్చారని తెలిపారు. తెలంగాణలోని వర్సిటీలు ఆత్మగౌరవ ప్రతీకలన్నారు. ‘మన రాష్ట్రం- మన కొలువులు’ నినాదంతో యువతీయువకులు లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రాణాలు అర్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో యువతకు న్యాయం జరగదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *