రాష్ట్ర మంత్రి గంగుల
సేవలు మరువలేనివి

బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేశ్ రెడ్డి
తిమ్మాపూర్, మే 8 (విశ్వం న్యూస్) : రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ రానున్న రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ప్రజా సేవకు అంకితం కావాలని బీఆర్ఎస్ ఎల్పి కార్యదర్శి మాదాడి రమేశ్ రెడ్డి కోరారు. సోమవారం మంత్రి గంగుల కమలాకర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రిని స్వయంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేశ్ రెడ్డి మాట్లాడుతూ… గత ఇరవై సంవత్సరాలుగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న మంత్రి గంగుల కమలాకర్ ను ప్రజలు మూడు సార్లు శాసన సభ్యునిగా అసెంబ్లీకి పంపిన ఘనత కరీంన గర్ ప్రజలకే దక్కుతుందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో బారీ మెజారిటీతో గెలిపించి తీరుతారని రమేశ్ రెడ్డి ఆశాబావం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కరీంనగర్ కు చేసిన అభివృద్దే విజయాన్ని సాధించి పెడతాయని రమేశ్ రెడ్డి కొనియాడారు.