తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక యువజన విభాగం నగర కమిటీ నియామకం

కరీంనగర్, జనవరి 13 (విశ్వం న్యూస్) : తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా యువజన విభాగం నగర కమిటీ ని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్, జిల్లా అధ్యక్షులు జంపాల నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరాల వెంకటస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీరాముల రమేష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి అదిములం మహేష్ తదితరులు పాల్గొన్నారు. నగర యువజన విభాగం అధ్యక్షుడిగా బోనకుర్తి సాయికృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి గా విలాసాగరం అనిల్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువజన విభాగం కమిటీలు వేయడం జరుగుతుందని సంఘా కార్యక్రమాలలో యువకులను ఎక్కువగా భాగస్వామ్యం చెయ్యాలనే ఉద్దేశంతో యువజన కమిటీ లు వేయడం జరుగుతుందని ఎదైన మార్పు యువకుల ద్వారానే సాధ్యం అవుతుందని యువకులు కూడ సంఘా కార్యక్రమలలో పాల్గొని యువశాక్తిని చాటాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గర్శకుర్తి విద్యాసాగర్, కోత్వాల అశోక్, శ్రీరాముల రమేష్, మిడిదొడ్డి వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు.