తెలంగాణ రాష్ట్ర స్థాయి సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్-2025 ఘనంగా ముగిసింది

తెలంగాణ రాష్ట్ర స్థాయి సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్-2025 ఘనంగా ముగిసింది

హైదరాబాద్‌, మార్చి 11 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర స్థాయి పురుషులు & మహిళల సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్-2025 పోటీలు మార్చి 10,11వ తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో వైభవంగా నిర్వహించబడ్డాయి. పారా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు అసోసియేషన్ అధ్యక్షులు, కార్యనిర్వాహక సభ్యులు సింగారపు బాబు ప్రత్యేక కృషి చేశారు.

రాష్ట్రం నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు వివిధ జిల్లాల తరఫున ప్రాతినిధ్యం వహించారు. పోటీలు ఉత్కంఠభరితంగా సాగి, వరంగల్ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. మేడ్చల్ జిల్లా రన్నరప్‌గా నిలిచింది. ఇతర జిల్లాల క్రీడాకారులు కూడా తమ ప్రతిభను ప్రదర్శించి మెప్పించారు.

కార్యక్రమానికి శృఋ ఫౌండేషన్ ఫౌండర్-చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, హెలెన్ కెల్లర్స్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్-చైర్మన్ పఠాన్ లయన్ ఉమ్మర్ ఖాన్ గౌరవ అతిథులుగా హాజరై, క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మార్చి 21-23 తేదీల్లో తమిళనాడు, ఈరోడ్‌లో నిర్వహించనున్న 13వ జాతీయ స్థాయి పారా సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సింగారపు బాబు, గాడిపల్లి ప్రసాంత్‌లను అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. క్రీడా సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు మరిన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *