దాసోజుకు కేసీఆర్ ఆశీస్సులు

- ఎమ్మెల్సీ నామినేషన్ అనంతరం కేసీఆర్‌ను కలిసిన దాసోజు
హైదరాబాద్, మార్చి 11 (విశ్వం న్యూస్) : దాసోజు శ్రవణ్ బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా అవకాశం పొందిన డాక్టర్ దాసోజు శ్రవణ్ తన నామినేషన్ అనంతరం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రవణ్ పార్టీపై తన నిబద్ధతను వ్యక్తం చేస్తూ, పార్టీ నాయకత్వం అందించిన అవకాశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు కేసీఆర్ ఆశీస్సులు లభించాయి. పార్టీకి సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని శ్రవణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ నాయకత్వం నుంచి ఎమ్మెల్సీగా అవకాశం రావడం పట్ల శ్రవణ్ అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.