ఆలయ కమిటీలు రక్షణ చర్యలు చేపట్టాలి

కరీంనగర్ టౌన్ ఏసిపి తుల శ్రీనివాసరావు
తిమ్మాపూర్, జనవరి 21 (విశ్వం న్యూస్) : కరీంనగర్ నగరంలోని టౌన్ ఏసీపి కార్యాలయంలో శనివారం పోలీస్ అధికారులు, ఆలయ కమిటీ నిర్వహణ, పాలకవర్గo, ఆలయాల పరిరక్షణ సభ్యులతో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో టౌన్ ఏసిపి తుల శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణ, గ్రామాలలో దేవాలయాలు చాలా వరకు నిర్మానుష్య ప్రదేశంలో ఉండడం, ఎటువంటి రక్షణ చర్యలు లేక పోవడం వలన, ఇటీవల కాలంలో దేవాలయాలలో వరుస దొంగతనాలు పెరిగిపోతున్నవి అని, భక్తులు ఎంతో విశ్వాసంతో దైవ దర్శనం చేసుకొనే దేవాలయాల రక్షణకు సంబంధించిన విషయాలపై నిర్లకష్యం చేయడం వల్ల, ఎంతో పవిత్రంగా భావించే దేవాలయాలలో దొంగతనాలు జరగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, అందుకే ఆలయ కమిటీలు, కార్యనిర్వహణ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని తప్పకుండా దేవాలయాల రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆలయాల రక్షణలో భాగంగా దేవాలయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు, వీలైతే ఒక నైట్ వాచ్ మేన్ ను ఏర్పాటు చేసుకోవాలి. విలువైన ఆభరణాలు, నగదును బ్యాంక్ అకౌంట్, లాకర్లో పెట్టుకోవాలి అని, ఇటువంటి చర్యల వల్ల దొంగతనాలు అరికట్టవచ్చును అని తగు సూచనలు సలహాలు అందజేశారు.
ఈ సమావేశంలో 1వ పట్టణ ఇన్స్పెక్టర్ నటేష్, 2వ పట్టణ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు, 3వ పట్టణ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి లతో పాటు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.