టెన్త్ విద్యార్థులు… ఆందోళన వీడండి

  • ప్రశాంతంగా పరీక్షలు రాయండి
  • తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
    మనో ధైర్యాన్ని కల్పించండి
  • బి సి టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి

వరంగల్, ఏప్రిల్ 5 (విశ్వం న్యూస్) : టెన్త్ పరీక్షల పరంగా జరుగుతున్న సంఘటనలు, ప్రచారాల ప్రభావాలకు గురై విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని బి సి టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి కోరారు. ఈ మేరకు కాజీపేటలో బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులు పరీక్షా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇప్పుడు టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు రెండేళ్ల క్రితం 8, 9వ తరగతులను కరోనా ప్రభావంతో సరిగా చదువుకోలేని పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రెండు పేపర్లు ఉన్న పరీక్ష విధానాన్ని మార్చి ఒకే పేపర్ విధానంతో పరీక్షలను నిర్వహిస్తుందని తెలిపారు. ఏడాది నుంచి విద్యార్థులు తమ తమ పాఠశాలలో నిర్వహించిన ఎఫ్ ఏ వన్, టూ, త్రీ, ఫోర్ పరీక్షలతోపాటు అనేక స్లిప్ టెస్ట్ లను సమర్థవంతంగా పూర్తిచేసుకుని సంవత్సర పరీక్షలకు సంసిద్ధులైన విద్యార్థులను ప్రస్తుతం టెన్త్ పరీక్ష పరంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు తీవ్రంగా కలవరానికి గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టెన్త్ పరీక్షల పరంగా వస్తున్న వార్తలను చూసిన విద్యార్థులు తమ తమ ఉపాధ్యాయులకు ఫోన్ చేసి పరీక్షలు జరుగుతాయా..? అంటూ ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంగా వ్యవహరించి విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన వీడేలా మనోధైర్యాన్ని కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *