కబ్రిస్తాన్ని శుభ్రం చేయించిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి

కబ్రిస్తాన్ని శుభ్రం చేయించిన
మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి

జమ్మికుంట, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలో గల ఆభాది జమ్మికుంటలో కరీంనగర్ రోడ్డు వైపున ఉన్న ముస్లిం కబ్రిస్తాన్ని శుభ్రం చేయించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజశేఖర్ రావు బృందం. కబ్రిస్తాన్లో గల పిచ్చి చెట్లను స్వయంగా దగ్గర ఉండి జెసిబి ద్వారా పిచ్చి చెట్లను తొలగించారు.

రంజాన్ పండుగ శుభ సందర్భంలో జమ్మికుంట మరియు చుట్టుపక్క గ్రామాల ముస్లిం సోదరులు వచ్చి కబ్రిస్తాన్, ఈద్గా లో నమాజు కొరకు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో ముస్లింలు వస్తారని వారికి ఇబ్బందికరంగా ఉన్నా జెసిబి ద్వారా పిచ్చి చెట్లను మరియు చెత్త చెదారం లేకుండా మరియు లైటింగ్ తాగునీరు ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ముందు జాగ్రత్త గా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తమ బృందాన్ని తీసుకువచ్చి శుభ్రం చేశారు

ఈ కార్యక్రమంలో ఆపాది జమ్మికుంట 13వ వార్డు కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, మరియు ఆభాది మ్మికుంట ముస్లిం సోదరులు, ఆభాది జమ్మికుంట పెద్ద మజీద్ సదర్ సాబ్, గౌస్, పాషా భాయ్, అన్వర్, అంజద్, అక్బర్, తదితరులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *