తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి పూలే
గోవిందరావుపేట, జనవరి 3, ( విశ్వం న్యూస్) :- బహుజనులకు సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శప్రాయమని బహుజన సమాజ్వాజ్ పార్టీ మండల అధ్యక్షుడు అజయ్ కుమార్ అన్నారు మంగళవారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశానికి మొట్ట మొదటి మహిళ ఉపాధ్యాయురాలు,సావిత్రి భాయి పూలే 192 వ జయంతి ని బహుజన్ సమాజ్ గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షులు డొంక చిన్న అధ్యక్షత ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమనికి మండల అధ్యక్షులు అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళ సాధికారత,అంటరానితనం సామాజిక సేవ దృక్పథం ఉన్న వెక్తుల లో భారతదేశంలో,మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిభాయి పూలే దంపతుల కృషి వారి జీవిత ప్రయాణం ఎందరికో ఆదర్శంగా వారు నిలిచారని అన్నారు . 170 సంవత్సరల క్రితమే బహుజనులైన అన్ని వర్గాల ప్రజలకు కులమత భేదాలకు అతితంగా ఈ సమాజాన్ని ప్రేమిస్తూ స్త్రీలకు సైతం విద్య అందించిన గొప్ప చరిత్ర బాలేదని కొనియాడారు యువత,విద్య వంతులు,మేధావులు ఉద్యోగస్తులు మహనీయుల చరిత్ర, పూర్తిగా చదివి,వారి ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఇదే మనం వారి త్యాగాలకు మనం ఇచ్చే నిజమైన నివాళి అంటూ ఈసందర్భంగా మాట్లడారు.ఈ యొక్క కార్యక్రమం లో ప్రధాన ఉపాధ్యాయలు రఘు రామ్ సార్ గారు, అశోక్ సార్ గారు, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ సంగి సందీప్ గారు, BVF నాయకులు శ్రీహరి , శ్యామ్, అన్వేష్ , నవీన్ ,సమీర్ , చందు,కార్తిక్ ,దిలీప్, శరత్ కుమార్ మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
