దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

కలెక్టర్ ని కోరిన సిలివేరు శ్రీకాంత్
జమ్మికుంట, ఆగస్టు 2 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్ కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ బి గోపి ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో 2021 సంవత్సరంలో హుజురాబాద్ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సదరం క్యాంప్ నందు 2000 మంది బాధితులను గుర్తించి వైద్య శాఖ నుండి సంబంధిత గుర్తింపు పత్రాలు కేవలం 300మంది మాత్రమే పొందగలిగారు.
మిగతా 1700మంది బాధితులకు సంబంధించిన గుర్తింపు పత్రాలు (సదరం సర్టిఫికెట్లు) అందక కష్టాలు పడుతున్నారని వారి సమస్యపై దృష్టి సారించి సమస్య పరిష్కరించే విధంగా చూడవలసిందిగా కలెక్టర్ ని సిలివేరు శ్రీకాంత్ కోరారు.
