
- కాంగ్రెస్ కు ప్రజల మద్దతు నాయకుల మధ్య కత్తుల వైరం
- బల్మూరీ వెంకట్ కే మా మద్దతు అంటున్నహుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు.
- అధిష్టానం బల్మూరి వెంకట్ కే టికెట్ అని ప్రకటించింది
జమ్మికుంట, మే 4 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీలో 2021 ఉప ఎన్నికల నాటి నుండి ఇప్పటివరకు ఇద్దరు నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం కార్యకర్తలలో అయోమయం అవరిస్తుంది. ఏ.ఐ.సి.సి మెంబర్, ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుదిగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జిగా బల్నూరి వెంకట్ కొనసాగుతుండగా, మాజీ ఎం.పి పొన్నం ప్రభాకర్ కు సుధీర్ఘ రాజకీయ అనుభవం, మాజీ రాష్ట్ర ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులుగా, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ గా, మాజీ ఎం.పి గా. ప్రస్తుతం ఏ.ఐ.సి.సి మెంబర్ గా మాజీ ఎం.పి పొన్నం ప్రభాకర్ కొనసాగుతున్నాడు.

ఇద్దరు ఏ. ఐ.సి.సి సభ్యులే
రాజకీయ సమీకరణాలు మార్పుల నేపథ్యంలో 2021 ఉప ఎన్నికలలో పొన్నం తన అనుచరుడు పత్తి కృష్ణారెడ్డికి టికెట్ ఇప్పించే క్రమంలో రాజకీయ సమీకరణాల మార్పు వలన బల్మూరీకి అధిష్టానం టికెట్ ఇచ్చింది. టికెట్ ఆశించి భంగపడ్డ పత్తి కృష్ణారెడ్డికి పొన్నం అండ ఉంది అనేది తెలిసిన విషయమే. బల్మూరీ వెంకట్ ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చెందినా నియోజకవర్గ ప్రతి గ్రామంలో కార్యకర్తలను వారి సమస్యలను పరిష్కరిస్తూ, నియోజక వర్గం మొత్తం తిరుగుతూ పార్టీ బలోపేతం, పూర్వ వైభవం దిశగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వైభవం దిశగా అడుగులు వేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ తీరిక లేకుండా తపన పడుచున్నాడు.
రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో బల్మూరీ వెంకట్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేములవాడలో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మురి వెంకట్ అని మీడియా ముఖంగా వెలిబుచ్చారు. అధిష్టానం టికెట్ బల్మూరి వెంకట్ కే అని ప్రకటించాక కూడా వేరే ఎవరైనా పోటీలో నేను ఉంటాను.. అని అంటారా? నేను పోటీలో ఉంటాను అనే మాటలు కృష్ణారెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు కాదా అని సీనియర్ నాయకుల అభిప్రాయం.
ఉప ఎన్నికల నుండి ఓటమి పాలైనా, నియోకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తలను సమన్వయ పరుస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ వైభవం దిశగా అడుగులు వేస్తూ పార్టీని బలేపేతం చేస్తున్నాడు బల్మురి వెంకట్. పొన్నం అండ తోనే పత్తి కృష్ణారెడ్డి కూడా రానున్న ఎన్నికలలో నియోకవర్గం నుండి తనుకూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తన ప్రయత్నం చేస్తూనే తనకు అనుకూలంగా నాయకుల చుట్టూ తిరుగుతూ తను పోటీలో ఉన్నాడనే భావనను వెలిబుచ్చుతున్నాడు.
బల్మూరి అనుచరుడు…
కసుబోజుల వెంకన్న నేపథ్యం… (జమ్మికుంట పట్టణ నివాసి) 30 సంవత్సరాల క్రితమే
ఎన్.ఎస్.యు.ఐ మండల అధ్యక్షునిగా , జిల్లా ఎన్.ఎస్.యు.ఐ ప్రధాన కార్యదర్శిగా , జిల్లా ఎన్.ఎస్.యు.ఐ ఉపాధ్యక్షడిగా జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, వైస్ ఎం.పి.పిగా (వెంకన్నభార్య), డి.సి.సి ప్రధాన కార్యదర్శిగా, డి.సి.సి ఉపాధ్యక్షడిగా, డి.సి.సి అధికార ప్రతినిధిగా, జమ్మికుంట కాంగ్రెస్ పార్టి పట్టణ అధ్యక్షుడిగా, ప్రస్తుతం… మాజీ పట్టణ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడిగా ఉన్నాడు.
పొన్నం అనుచరుడు…
పత్తి కృష్ణారెడ్డి నేపథ్యం… (జమ్మికుంట పట్టణ నివాసి) చాలా సంవత్సరాలు గా సి.పి.ఎం పార్టి లో ఉన్నత పదవిలో చేసిన తరువాత 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేరాడు. ప్రస్తుతం… జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాడు.
ఇది ఇలా ఉండగా బల్మురి వెంకట్ నియోకవర్గస్థాయిలో కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేసే క్రమంలో బల్మురి వెంకట్ కు పొన్నం ప్రభాకర్ కు మధ్య సయోధ్య లేకపోవడంతో కార్యకర్తలలో అయోమయం ఏర్పడింది. బల్మురీ వెంకట్ కు రాష్ట్ర నాయకుల నుండి కేంద్ర నాయకత్వాల ఆశీస్సులతో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల బలం, ప్రజల మద్దతు కూడా ఉన్నాయి.

పొన్నంకు కూడా తెలిసని, పార్టి టికెట్ బల్మురి వెంకట్ కే అని అధిష్టానం ప్రకటించాక తన అనుచరునికి వెనుక నుండి ప్రోత్సాహం అందించడం సమంజసం కాదని. సీనియర్ నాయకుల చర్చనీయాంశం. స్థానిక నేతల అభిప్రాయం. ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో అధిష్టానం వీరిద్దరితో చర్చించి ఇద్దరినీ ఒకే తాటిపై తెస్తే నియోకవర్గం లో నాయకులకు, కార్యకర్తలకు బరోసా అనేది ఉంటుంది.
బల్మురి వెంకట్ అనుచరుడిగా పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న కసుబోజుల వెంకన్నను పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఏ. ఐ.సి.సి. మెంబర్ ఐన బల్మూరి వెంకట్ ను సంప్రదించకుండా పార్టీ నుండి సస్పెండ్ చేయడం వెనుక పొన్నం ఉన్నాడనేది స్థానిక కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశం ఐనది.
- ఇంకా ఎన్నాళ్ళు, ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ నాయకుల మధ్య సమన్వయం ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే.