కరీంనగర్

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవికి తిరుగు వారం బోనం

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవికి
తిరుగు వారం బోనం

సమర్పించిన గౌడ సంఘం నాయకులు
కరీంనగర్ బ్యూరో, మే 4 (విశ్వం న్యూస్) : బుధవారం రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కి తిరుగు వారం బోనం సమర్పించిన కరీంనగర్ పట్టణ గౌడ సంఘం నాయకులు. బోనాల పండుగ (సిద్దోగం) ఉత్సవాలు జరిగిన వారానికి చేసే కార్యక్రమమే తిరుగు వారం బోనం, కరీంనగర్ పట్టణ గౌడ్ కులస్తులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీరేణుక ఎల్లమ్మ దేవి తిరుగు వారం బోనం పండుగ ఘనంగా నిర్వహించినారు. తిరుగు వారం బోనం సమర్పించిన సందర్భంగా గౌడ కులస్తులకు ఆలయ ప్రాంగణంలో 200 వందల మంది కి బోజనాలు ఏర్పాటు చేశారు.

గౌడ సంఘం నాయకుల ఆహ్వానం మేరకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ని దర్శించుకొని ఆలయ కమ్యూనిటీ భవన్ కు/ ప్రహారీ గోడ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలు వారి ఎంపీ కోట నుండి ఇచ్చుటకు అంగీకరించారు. టి ఎన్జీ ఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ని దర్శించుకున్నారు.

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయానికి కన్స్ట్రక్షన్ దాతలు:
గ్రానైట్ వ్యాపార వేత్త రాచకొండ తిరుపతి గౌడ్ వారి సతీమని (భార్య) లక్ష్మి స్మారకార్థం శ్రీరేణుక ఎల్లమ్మ దేవి ఆలయానికి చుట్టు ప్రహారీ గోడ కట్టించి, ప్రహారీ గోడ కు ఇరువైపుల రంగులు తో కలిపి తన సొంత ఖర్చులతో రెండు లక్షల రూపాయల పని చేపించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ప్రధాన ముఖ ద్వారం వద్ద స్వాగత కమాన్ ను కార్పొరేటర్లు సుదగోని మాధవి – కృష్ణ గౌడ్, గుగ్గిళ్ల జయశ్రీ – శ్రీనివాస్ గౌడ్, కోటగిరి భూమా గౌడ్ లు వారి సొంత లక్ష రూపాయల ఖర్చులతో చేపించారు. రెండు సిమెంట్ బాల్లాలు సొంత ఖర్చులతో బత్తిని నరేష్ గౌడ్ తండ్రి కిషోర్ గౌడ్ నిర్మించారు. కోడూరి మహేష్ గౌడ్ రూ.25000 విలువ గల హుండీ, బత్తిని నరేష్ రూ.25000 విలువ గల హుండీలను ఆలయానికి డొనేట్ చేశారు.

శ్రీరేణుక ఎల్లమ్మ దేవి కి కొందరు గౌడ్ పెద్దలు ఎక్కువ మొత్తంలో విరాళాలు, అలాగే మిగత గౌడ కులస్తులు తోచినంత విరాళాలు ఇచ్చి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి (సిద్దోగం)బోనాల పండుగ కు సహకరించిన వారందరికీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్,రాచకొండ తిరుపతి గౌడ్, పంజాల సురేందర్ గౌడ్, పంజల విజయ భాస్కర్ గౌడ్ (అడ్వకేట్), మాచర్ల ప్రసాద్ గౌడ్, బుర్ర పరశురాం గౌడ్ (బ్యూరో చీఫ్, నినాదం తెలుగు దినపత్రిక ) సుదగోని ఎస్.ఎల్ గౌడ్, సుదగోని ఆంజనేయులు గౌడ్,గడ్డపార వెంకన్న గౌడ్, గోప నాయకులు బుర్ర జగదీశ్వర్ గౌడ్, కోడూరి మహేందర్ గౌడ్, బత్తిని తిరుపతి గౌడ్, బత్తిని సత్యం గౌడ్, ఆలయ పూజారులు, బత్తిని కిషోర్ గౌడ్, నరేష్ గౌడ్, రాజ మనోహర్ గౌడ్ (మున్సిపల్), రంగు చెన్నయ్య గౌడ్, గౌడ్ పెద్దలు, గౌడ యువనాయకులు, గౌడ్ కులస్తులు, గౌడ్ సోదరి సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *