కన్నుల పండువగా
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి
కళ్యాణ మహోత్సవం

- భక్తులతో కిటకిటలాడిన దేవాలయం

కాజీపేట, , మార్చి 9 (విశ్వం న్యూస్) : కాజీపేట 61వ డివిజన్లోని చైతన్యపురిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి కనుల పండువగా జరిగింది గత మూడు రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన ప్రత్యేక పూజలు రాత్రి వరకు కొనసాగాయి*ఉదయం ఏడు గంటలకు బాలభాగంతో ప్రత్యేక పూజలు ప్రారంభమైనవి. 8 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక అభిషేకమును నిర్వహించారు.

అనంతరం హోమం, బలిహరణం పారాయణములు చేశారు. *ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది ఈ వేడుకల్లో ఆలయ నిర్వాహక కార్యవర్గం అధ్యక్షులు పంజాల అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు ఐలేని వెంకటమల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మేజర్ వడ్డేపల్లి నరేందర్, సహాయ కార్యదర్శులు దిలీప్ కుమార్, శనిగరపు సుజాత, కోశాధికారి పెద్ది అశోక్ కుమార్, కార్యవర్గ సభ్యులు రాచర్ల మధులత, పిట్ట వెంకటేశ్వర్లు, డాక్టర్ రవిచంద్ర, పెద్ది ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, ఆకుల రాజన్న గౌడ్, శీలం సమ్మయ్య, గౌరవ సలహాదారులు రాచర్ల శంకరయ్య, వంగాల సత్యనారాయణరెడ్డి, ఎక్స్ అఫీషియల్ సభ్యులు వీరయ్య, రవీందర్, రాజమోహన్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఉత్సవాల నిర్వహణ అభినందనీయం..
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాజీపేట 61 డివిజన్లోని చైతన్యపురిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ అభినందనీయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొనియాడారు. ఆధ్యాత్మిక అభివృద్ధికి కృషి చేస్తున్న దేవాలయ నిర్వాహకులను అభినందిస్తున్నట్లు ప్రకటించారు. ఇటువంటి ఉత్సవాల నిర్వహణతో కాలనీవాసుల్లో ఐక్యత పెరుగుతుందన్నారు. ఆదివారం రాత్రి జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు

– వార్త శ్యామ్ (విశ్వం న్యూస్)