తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కొత్తగా ఏమి కేటాయింపులు లేవు

పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్
కరీంనగర్, ఫిబ్రవరి 6 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరిష్ రావు అంకెల గారడీ, మాయ మాటలతో మేడి పండు మాధిరిగా రంగుల ప్రపంచంలాగా మెఘా బడ్జెట్ గా చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. ప్రజలను మభ్య పెట్టడం.. మోసం చేయడానికి అంకెలు పెంచి బడ్జెట్ పెడుతున్నారని గతంలో అనేక మార్లు చెప్పిందే ఇప్పడు నిజమైంది. రాష్ట్ర బడ్జెట్ లో డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటి స్థలాల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. రాష్ట్రంలో 50శాతం జనాభా కలిగిన బిసిలకు బడ్జెట్లో కేవలం 6229 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిని బట్టీ బిసిలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో తెలుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నది. ఈ సారి కూడ అదే విధంగా చేసినది.
ఎన్నికల హామీ:
నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్ లో మాటే ఎత్తలేదు. బిసి యాక్షన్ ప్లాన్ ను విస్మరించారు. బిసి బంధు ఉంటుందని ఆశీంచాము. కానీ ఊసే ఎత్తలేదు. ఈ బడ్జెట్ తో పేద ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు సంక్షేమ పేరు మీద సొంత డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని విమర్శించారు.