ఇది విగ్రహంకాదు.. విప్లవం… ముఖ్యమంత్రి కేసీఆర్

  • అంబేద్కర్ విశ్వమానవుడు.. అంబేద్కర్ సిద్దాంతం విశ్వజనీనం.. ఆచరణాత్మక మైన ఆలోచ ప్రారంభం కావాలి.

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : అంబేడ్కర్‌ విశ్వ మానవుడు.. ఆయన సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం అని అన్నారు సీఎం కేసీఆర్‌. అంబేడ్కర్‌ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటిందని.. ఎవరో అడిగితే అంబేడ్కర్‌ విగ్రహం పెట్టలేదన్నారు. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నాం. సచివాలయానికి కూడా అంబేడ్కర్‌ పేరు పెట్టుకున్నామన్నారు. ఇక్కడికి దగ్గరలోనే అమరవీరుల స్మారకం ఉందన్నారు . ఇది విగ్రహం కాదు.. విప్లవం.. అని అన్నారు కేసీఆర్.

  • అంబేద్కర్ పేరిట ప్రతి సంవత్సరం అవార్డులు అందిస్తాం.. అందుకోసం 51కోట్లు డిపాజిట్ చేస్తాం.
  • భారతదేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే ప్రభుత్వం మనదే..మనదే..
  • దేశమంతా దళితబందు
    అమలుచేసి తీరుతాం..
  • భారతదేశాన్ని సరైన లైన్ లో పెట్టడానికి నా..చివరి రక్తపుబొట్టు వరకు పోరాటం చేస్తాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *