ఈటెలను ఎదుర్కొనే ధమ్మేవరికి ఉంది..

ఈటెలను ఎదుర్కొనే ధమ్మేవరికి ఉంది..

ఎమ్మెల్యే ఈటెలను గెలిపించిన మద్దతుదారులు, కోవర్టులేవరు..?
తస్మాత్ జాగ్రత్త.. మళ్ళీ ఆయన మనుషులకే పదవులా..ఎందుకు..?

హుజురాబాద్, మార్చి 8 (విశ్వం న్యూస్) : రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సరం నర క్రితం సంచలం సృష్టించిన ఎన్నిక హుజురాబాద్ ఈటెల రాజేందర్ గెలిచిన ఎన్నిక. ఈటెల రాజేందర్ 23వేల పైచిలుకు మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మీద గెలిచారు. అంటే ఆయన నన్ను చంపుకుంటారో.. సాదుకుంటారో.. మీ ఇష్టం అని మాయ మాటలు చెప్పి ప్రజల్లోకి వెళ్లి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మాజీ ఎంపీ వివేక్ దగ్గర కోట్లాది రూపాయల అప్పుచేసి డబ్బు పంపిణీ చేసి గెలిచినా వాస్తవం బయటపడింది అందరికి తెలిసిందే.. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యంగా పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, క్యాడర్ ఇంతమంది ఉండంగా 23 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ఇలా గెలిచారు..? దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేది ఈరోజు జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాలలో ప్రతి ఒక్కరి నోట్లో ఉన్నటువంటి ప్రశ్న..? దీనికి సమాధానం ఏంటంటే జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాల్లో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ (కొంతమంది) దాదాపుగా అందరూ ఆయన మనుషులే.. తెలంగాణ భాషలో చెప్పాలంటే వీళ్ళందరూ కూడా కోవర్టులని చెప్పుకోవచ్చు..? యావత్ తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈటలకు పట్టం కట్టడానికి గల కారణమే అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకుల యొక్క అవినీతిమయం.
ప్రతి ఒక్కరూ టిఆర్ఎస్ కండువా కప్పుకొని మీదికి చూడ ప్రచారం చేయడమే తప్ప.. వారి లోపట అంతా కూడా డబ్బుమయం, ఈటెల మయం అని తేలిపోయింది. కాబట్టి ఆయన 23 పైచిలుకు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న తతంగం ఏంటంటే ఇంతకుముందు కూడా మాజీ కాంగ్రెస్ (కొంతమంది) వాదులకు పదవులు ఇచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా వాళ్లకే పదవులు కట్టబెట్టాలని చూస్తున్నట్లు జమ్మికుంట,హుజురాబాద్ ప్రజలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈటెల రాజేందర్ ను వ్యతిరేకించే వారికి పదవులు ఇస్తారా..లేక ఆయనకు మద్దతుదారులకు పదవులు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ను ఎదుర్కొంటున్న వారిలో కొంతమంది మాత్రమే కనబడుతున్నారు. అందులో కాంగ్రెస్ హుజురాబాద్ పట్టణం నుండి తిప్పారపు సంపత్ వారి కుటుంబ సభ్యులు (17 కుటుంబాలు) ఇల్లంతకుంట మండలం నుండి గుండ్ల కుమారస్వామి అతని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి మీద అక్రమ కేసులు పెట్టారని వారి కుటుంబాన్ని నాశనం చేశారని అని చెప్పేసి మీడియా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు మన కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి.
అదేవిధంగా జమ్మికుంట నుండి కొత్తూరి సాగర్ ను నమ్మించి రాజకీయంగా మోసం చేసిన ఘనత కూడా ఈటెలకె దక్కింది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా ఇన్చార్జి మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు మరొకసారి పునరాలోచించి 22 సంవత్సరాల నుండి బీఆర్ ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, నిజమైన ఉద్యమకారులకె జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి కట్టబెట్టాలని టిఆర్ఎస్ శ్రేణులు,పార్టీ కార్యకర్తలు, ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో మరొకసారి పునరాలోచించాలని జమ్మికుంట చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *