ఎన్ కౌంటర్ లో ముగ్గురు
మావోయిస్టుల మృతి ?

- కొనసాగుతున్న
సీ-60 బలగాల సెర్చింగ్..
గడ్చిరోలి, మే 1 (విశ్వం న్యూస్) : తుపాకుల మోతతో దద్దరిల్లిన అటవీ ప్రాంతం. మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ సరిహద్దు అడవుల్లో నక్సల్స్ కార్యకలాపాలు ఉన్నాయని సమాచారం తెలుసుకున్న బలగాలు కూంబింగుకు దిగడంతో ఆ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా బామ్రాగడ్ తాలూకా కెడ్మారా అడవుల్లో ఎదురు కాల్పులు జరిగినట్లుగా పోలీసుల వర్గాల సమాచారం. మావోయిస్టుల నిర్మూలనలో బాగంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సీ-60 బలగాలకు మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి అని పోలీస్ వర్గాలు సమాచారం.
పెరిమిలి, అహేరి దళాలు ఆదివారం రాత్రి సుమారు 7 గంటలకు దట్టమైన అడవి ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నట్లుగా తెలుసున్న బలగాలు ఆ ప్రాంతానికి కుంబింగ్ కోసం చేరుకోవడంతో ఇరువర్గాలు ఎదురుపడడంతో ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్ జరిగినట్టుగా, ముగ్గురు నక్సల్స్ చనిపోయారని, వారిని పెరిమిలి దళ కమాండర్ బిట్లు మాద్వి, దళ సభ్యుడు వాసు, అహేరి దళ సభ్యుడు శ్రీకాంత్ లుగా గుర్తించినట్లు పోలీస్ వర్గాల సమాచారం. సీ-60 బలగాలు తెల్లవారు వరకు కెడ్మారా అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చింగ్ కొనసాగుతుందని సమాచారం. ఇంకా వివరాలు పూర్తిగా రావాల్సి ఉంది.