రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు

హైదరాబాద్, జూలై 27 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.
వరద భాదిత జిల్లాలకు
స్పెషల్ అధికారుల నియామకం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భారీ వర్షాలు , వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
ములుగు జిల్లా – కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సభ్య కార్యదర్శి.
భూపాల పల్లి – పి గౌతమ్, సెర్ప్, సి.ఈ.ఓ
నిర్మల్ – ముషారఫ్ అలీ, ఎక్సయిజ్ శాఖ, కమీషనర్
మంచిర్యాల – భారతి హోలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ , స్పెషల్ సెక్రెటరీ.
పెద్దపల్లి – సంగీత సత్యనారాయణ,
ఆసిఫాబాద్ – హన్మంత రావు, పంచాయితీరాజ్ శాఖ కమీషనర్