8 తహసిల్దార్లు, 10 నాయబ్ తహసిల్దార్లు, 2 సీనియర్ అసిస్టెంట్ లను బదిలీ

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి, జనవరి 7 (విశ్వం న్యూస్) : జిల్లాలో పరిపాలన సౌలభ్యం మేర రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 2 సీనియర్ అసిస్టెంట్ లు, 10 నాయబ్ తహసిల్దార్లు , 8 తహసిల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంథని ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జి రవిశంకర్ ను మంథని తహసిల్దార్ కార్యాలయానికి, మంథని తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న పి రవీందర్ ను పెద్దపల్లి కలెక్టరేట్లో ఖాళీగా ఉన్న సీనియర్ స్టెనో స్థానంలో బదిలీ చేశారు. సుల్తానాబాద్ ఎమ్.ఎల్.ఎస్ పాయింట్ వద్ద నాయబ్ తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న బి లక్ష్మిని ఆర్డిఓ మంథని కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ (ఎల్ఆర్)గా, ఆర్డిఓ మంథని కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ (ఎల్ఆర్)గా పనిచేస్తున్న ఎం మహేష్ కుమార్ ను సుల్తానాబాద్ ఎమ్.ఎల్.ఎస్ పాయింట్ వద్ద నాయబ్ తహసిల్దార్ గా, సుల్తానాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ గా పనిచేస్తున్న ఎన్ మల్లికార్జున్ రెడ్డిని పెద్దపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ గా, ఓదెల మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ గా పనిచేస్తున్న కే ధీరజ్ కుమార్ ను శ్రీరాంపూర్ మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ గా, పెద్దపల్లి తాసిల్దార్ కార్యాలయంలో నాయాబ్ తహసిల్దారుగా పనిచేస్తున్న సి అనిల్ కుమార్ ను ఓదెల మండలం తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దారుగా, శ్రీరాంపూర్ మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ గా పనిచేస్తున్న ఎన్ సాయి కృష్ణను పాలకుర్తి మండలం లోని తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ గా, పాలకుర్తి మండలం లోని తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ గా పనిచేస్తున్న ఎం.సదానందం ను సుల్తానాబాద్ మండలం లోని తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ గా, కమాన్పూర్ తాసిల్దార్ కార్యాలయంలో నయాబ్ తాసిల్దారుగా పనిచేస్తున్న ఎన్ విజయ్ ను ఎలిగేడు తహసిల్దార్ కార్యాలయంలో నాయాబ్ తహసిల్దారుగా, ఎలిగేడు తహసిల్దార్ కార్యాలయంలో నాయాబ్ తహసిల్దారుగా పనిచేస్తున్న డాక్టర్ ఆర్. రాముడు ను పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో నయాబ్ తాసిల్దార్ గా, పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో నాయాబ్ తహసిల్దారుగా పనిచేస్తున్న ఆర్ శ్రీనివాస్ ను కమాన్పూర్ తాసిల్దారు కార్యాలయంలో నాయాబ్ తహసిల్దార్ గా బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మారం మండల తహసిల్దార్ ఆర్. వెంకట లక్ష్మిని పెద్దపల్లి మండల తహసిల్దార్ గా, పెద్దపల్లి మండల తహసిల్దార్ బి. సుధాకర్ ను పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయ ఎఓ గా, కలెక్టరేట్ లో ఈ – విభాగం సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డి.శ్రీనివాస్ ను ధర్మారం మండల తహసిల్దార్ గా, పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయ ఎఓ గా పనిచేస్తున్న ఈ.పుష్పలతను కలెక్టరేట్ లో ఈ-విభాగం సూపరింటెండెంట్ గా, కలెక్టరేట్ లో డీ – విభాగం సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న జె.సునీత ను పాలకుర్తి మండల తహసిల్దార్ గా, ముత్తారం (ఎం.ఎన్.టి.)మండల తహసిల్దార్ గా పనిచేస్తున్న ఆర్. పద్మావతిని కలెక్టరేట్ లో డీ – విభాగం సూపరింటెండెంట్ గా, కలెక్టరేట్ లో ఎఫ్ – విభాగం సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న బి.జయశ్రీ ను జూలపల్లి మండల తహసిల్దార్ గా, పాలకుర్తి తహసిల్దార్ గా పనిచేస్తున్న కె. వరందాన్ ను ముత్తారం (ఎం.ఎన్.టి.) తహసిల్దార్ గా బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.