వీణవంక:బొడ్రాయి సంబురానికి
పాడి ఉదయానంద రెడ్డి భారీ విరాళం

- ఘనంగా శ్రీ భూలక్ష్మి – శ్రీ మహాలక్ష్మి – బొడ్రాయి : దుర్గమ్మ విగ్రహాల ప్రతిష్టాపన
జమ్మికుంట/ వీణవంక, జూన్ 7 (విశ్వం న్యూస్) : వీణవంక మండల కేంద్రంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో తేదీ 06.06.2023 నుండి 08.06.2023 వరకు మల్లారెడ్డి పల్లి గ్రామంలో శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి, దుర్గమ్మ మరియు పాఠశాలలో సరస్వతి దేవి గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన జరుగనున్నది. ఈ మహోత్సవముల కార్యక్రమాల గురించి మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మరియు మల్లారెడ్డిపల్లి గ్రామ ప్రజలు, పెద్దలు కలిసి పాడి ఉదయ్ నందన్ రెడ్డి (ఫౌండర్ & సి.ఈ.ఓ-యుప్ TV &.టురింటో)ని కలిసి వివరించిన వెంటనే స్పందించి, రూ. 51,116/- యాభైఒక్క వేల నూట పదహారు రూపాయలను విరాళంగా మల్లారెడ్డిపల్లి గ్రామస్తులకు తన అనుచరులచే అందజేశారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామంలో జరుగుతున్న శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి మహోత్సవ కార్యక్రమాలకు అడిగిన వెంటనే ఆర్థిక విరాళం అందజేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి గారికి నా తరఫున, మా గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, ఉపసర్పంచ్ ముద్దసాని బిక్షపతి, గ్రామ పాలక మండలి సభ్యులు, వీణవంక మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ హమీద్, వీణవంక గ్రామ మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య యాదవ్, వెన్నంపల్లి నారాయణ, మంతెన శ్రీధర్, కర్రే నాని, కొలిపాక శ్రీనివాస్, అమృత ప్రభాకర్, పల్లేర్ల కిరణ్, సమీడ్ల చిట్టీ, దూలం సమ్మయ్య, రామస్వామి, దూలం సురేష్, సిరిగిరి రాజశేఖర్, చిన్నల శ్రీకాంత్, వంశీ, పెద్దుల సాయి,ఓంకార్, మల్లారెడ్డిపల్లి గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.