వీణవంక మండలం:టెన్త్ పరీక్ష ఫలితాలు బాలికలదే పై చేయి

వీణవంక మండలం:టెన్త్ పరీక్ష
ఫలితాలు బాలికలదే పై చేయి

వీణవంక, మే 10 (విశ్వం న్యూస్) : నేడు విడుదలైనటువంటి 10వ తరగతి ఫలితాలలో వీణవంక మండలం నుండి మొత్తం 10 ప్రభుత్వ పాఠశాలలు,1 తెలంగాణ మోడల్ స్కూల్,1 కస్తూరిబా బాలికల విద్యాలయం మరియు 2 ప్రైవేటు పాఠశాలల నుండి నుండి 159 బాలురు, 141 బాలికలకు గాను 300 మంది పరీక్షకు హాజరుకాగా వీరిలో 155 మంది బాలురు, 141 మంది బాలికలు మొత్తము 296 మంది పాసైనారు.

ఉత్తీర్ణత శాతము బాలురు 98.6 శాతం బాలికలు 100 శాతం మొత్తం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల ఉత్తీర్ణత శాతము 98.66 గా రావడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీ విడపు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరము 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాదించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను హాజరైనటువంటి విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.

ఈ యొక్క ఫలితాల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి మరిన్ని ఉత్తమ ఫలితాలకు కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *