ఆపదలో ఆదుకునే మంచి మనసున్న మనిషి వినోద్ కుమార్

ఆపదలో ఆదుకునే మంచి
మనసున్న మనిషి వినోద్ కుమార్

  • ఇబ్బందులలో ఉన్న వ్యక్తులకు సమయాన్నిబట్టి సహకరించటం వారిని ఆదుకోవటం సహాయ సహకారాలు అందించే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్
  • కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి.

కరీంనగర్ (విశ్వం న్యూస్) : కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కానీ సహాయము కావలసిన సమయములో పనులు చేసే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ అని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ అండ్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శుక్రవారం రోజు మాట్లాడుతూ కులం మతము లేకుండా ఎవరికైనా అనారోగ్యమైన ఏదైనా ఇబ్బంది అయినా వారికి సరి అయిన సమయంలో నేనున్నానని ముందుకు వచ్చే వ్యక్తి బి వినోద్ కుమార్.

ఉమ్మడి జిల్లాలలో వర్షాలు పడ్డప్పుడు కొంతమందికి ఇబ్బందులు ఏర్పడినప్పుడు అలాంటి వ్యక్తులను ఆదుకున్న వ్యక్తి బి వినోద్ కుమార్ ముస్లిం వర్గాలలో కొంతమందికి సరియైన సమయంలో వారికి కావలసిన పనులు చేసి సమయానికి ఆదుకున్న వ్యక్తి డి వినోద్ కుమార్ కొంతమంది వ్యక్తులు వెళ్లి ఇలా ఉంది మాకు కొంచెం పని చేసి పెట్టండి అని చెప్పటంతోనే అక్కడ ఉన్న వ్యక్తులకు పక్కకు పెట్టి ఆ పేద ప్రజలకు ఆ అధికారికి ఫోన్ చేసి ఆ సమయంలో అలాంటి సమయంలో ఆదుకుంటున్న వ్యక్తి బి వినోద్ కుమార్ రాత్రి అనకుండా పగలు అనకుండా ఏ సమయానికి వెళ్లి కనబడిన వెంటనే ఏం పని అని పలకరించి ఆ పనిని చేపట్టడంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి బి వినోద్ కుమార్.

ముస్లిం కమ్యూనిటీలో కొంతమంది పేద వ్యక్తులకు కొన్ని హాస్పటల్లో ట్రీట్మెంట్ కొరకు అడిగిన వెంటనే ఆ హాస్పిటల్కు సంబంధించిన డాక్టర్ కు ఫోన్ చేసి అక్కడికి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తికి తెలవకుండానే ఆ హాస్పటల్లో బిల్లు చెల్లించిన వ్యక్తి బి వినోద్ కుమార్ ఎప్పుడు పలకరిస్తే చిరునవ్వుతో ఏం పని చెప్పండి చేసి పెడతాను అని చెప్పే వ్యక్తి బి వినోద్ కుమార్ ఇలాంటి వ్యక్తి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆ సమయానికి అక్కడికి వచ్చి పలకరిస్తూ ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి ఎంతో ధైర్యం ఇచ్చే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా తెలియజేశారు.

కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కూడా బి వినోద్ కుమార్ దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే ఆ సమస్యల పరిష్కారం కొరకు ఆ సంబంధించిన శాఖలకు సంబంధించిన మంత్రులకు రాష్ట్రస్థాయి అధికారులకు జిల్లాస్థాయి అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కారం కొరకు తన వంతు కృషి చేసే వ్యక్తి బి వినోద్ కుమార్ ఎన్నో సందర్భాలలో ఆ సమయానికి ఎక్కడ ఉన్నారని ఫోన్ ద్వారా మాట్లాడితే మీ పని ఏముంది చెప్పండి ఇక్కడి వరకు ఎందుకు వస్తారు మీ యొక్క పనిచేసి పెడతాను అని చెప్పి ఆ సంబంధించిన శాఖకు అధికారికి ఫోన్ చేసి తిరిగి మళ్ళీ ఫోన్ చేసి నా వ్యక్తికి మీ యొక్క సమస్యను తెలియజేశాను మీ యొక్క పని అవుతుందని తెలియజేస్తారు.

ఏ కులము కానీ ఏ మతం కానీ ఏ రాజకీయ పార్టీ అని ఏమీ చూడకుండా అలాంటి సమయంలో పని చేసి పెట్టే వ్యక్తి బి వినోద్ కుమార్ అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు. ఈ సందర్భంగా కొంతమంది విలేకరులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్ గురించి అడిగినప్పుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా నా హయాములో జరిగింది కనుక ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నాను అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *