తిమ్మాపూర్ లో రోడ్డు ప్రమాదం:ఒకరు మృతి

తిమ్మాపూర్ లో రోడ్డు ప్రమాదం..
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

తిమ్మాపూర్, (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బస్సు స్టేజ్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అట్ల పోచమల్లయ్య యాదవ్ (45) తిమ్మాపూర్ స్టేజి వద్ద రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన కారు పోచమల్లయ్య ను ఢీకొని పక్కనే ఉన్న స్తంభానికి ఢీ కొట్టి బోల్తా పడింది.

కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మల్లయ్య మృతి చెందాడు. కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎల్ ఎం డి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *