సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వార్నింగ్

  • జాగ్రత్తగా పని చేసుకోండి..
  • డబ్బులు వసూలు చేసిన
    వారి లిస్ట్ ఉంది
  • బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కట్‌ చేస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో సీఎం కేసీఆర్ ఎన్నికలపై మాట్లాడారు. ఎన్నికలపై సీఎం కేసీఆర్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.

అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని లేకపోతే నష్టపోతారని హెచ్చరించారు. దళితబంధులో ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేస్తున్నారని కేసీఆర్‌ ఆరోపించారు.

కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, వసూళ్లకు పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని కేసీఆర్‌ వెల్లడించారు. ఇదే చివరి వార్నింగ్‌.. మళ్లీ రిపీట్‌ అయితే టికెట్‌ దక్కదని, ఆ ఎమ్మెల్యేలను పార్టీ నుంచే సస్పెండ్ చేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు. అనుచరులు వసూలు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని కేసీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *