
హైదరాబాద్, జూలై 28 (విశ్వం న్యూస్) : మీడియా చిట్‌చాట్ లో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు తాము కేసీఆర్ ఇచ్చినంత మొత్తం ఇవ్వలేకపోయామని అందుకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు.
గతంలో కేసీఆర్ 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఇచ్చేవారని తాము కేవలం ఐదారు కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నామని అందుకే పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదని తేల్చేశారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలోనే కాదు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
