‘కీ’ ఎక్కడ

జగిత్యాల, ఏప్రిల్ 10 (విశ్వం న్యూస్) : 2018 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని, తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రికౌంటిగ్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం జరిగింది.

ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా ఎలక్షన్ అధికారి సమక్షంలో ఈ. వి.ఎం.లను భద్రపరిచిన వి.ఆర్.కే. ఇంజనీరింగ్ కాలేజ్ లోని స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసి అందులోని 17ఏ,17సి డాక్యుమెంట్స్ లను, సి.సి టివి పుటేజీ మరియు ఎన్నికల ప్రొసీడింగ్స్ ను ఈ నెల 11వ తేదీన సమర్పించాలని హై కోర్టు అప్పటి రిటర్నింగ్ అధికారిగ ఉన్న బిక్షపతి ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూం తాళాలు లేకపోవడం వల్ల ఈ.వి.ఎం లను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూంనీ తెరవడం జరగలేదు.

ఈ సంద్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ..ఒక జిల్లా కలెక్టర్ గారి దగ్గర గానీ లేదా అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర ఉండవలసిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఏమయ్యాయనీ, కోర్టు నుండి ఉత్తర్వులు వచ్చి ఇప్పటికీ ఆరు రోజులు గడుస్తున్న రూమ్ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలీదని, ప్రభుత్వ అధికారుల వద్ద ఉండవలసిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు వారి దగ్గర లేకపోవడానికి గల కారణాన్ని ప్రభుత్వమే చెప్పాలనీ దినికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలనీ, స్ట్రాంగ్ రూమ్ తెరవాలని కోర్టు నుండి ఉత్తర్వులు వచ్చినప్పటికీ స్ట్రాంగ్ రూమ్ తాళాలు లేవు అని చెప్పడానికి సమాధానం మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు చెప్తారా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమాధానం చెప్తారో చెప్పాలనీ నాలుగున్నర సంవత్సరాలుగా ఒక ఎలక్షన్ పిటీషన్ మీద పోరాడుతుంటే తీరా తాళాలు లేవని చెప్పడాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చనీ ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *