ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

కాజీపేట, మార్చి 11 (విశ్వం న్యూస్) : కాజీపేట జంక్షన్ పరిధిలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ లీడర్ కురుసపల్లి రవీందర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా హక్కుల సాధనకు తమ సంఘం కృషి చేస్తుందని తెలిపారు. రైల్వే శాఖ అభివృద్ధిలో మహిళా కార్మికుల పాత్ర కీలకమన్నారు. అంతకుముందు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

వార్త…శ్యామ్🖋️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *